![]() |
![]() |

సినిమా హీరోయిన్స్ కి మాత్రమే కాదు యాంకర్స్ కి మంచి ఫ్యాన్ బేస్ ఉంటుంది. అలాంటి వాళ్ళల్లో అలనాటి అందాల యాంకర్ సుమ, ఉదయభాను, ఝాన్సీ ఇలాంటి వాళ్ళ గురించి చెప్పుకోక తప్పదు. ఐతే ఝాన్సీ ఇప్పుడు యాంకరింగ్ చెయ్యట్లేదు కానీ రవీంద్ర భారతిలో నాటకాలు రచించడం, ప్రదర్శించడం వంటివి చేస్తోంది. ఉదయభాను, సుమ యాంకరింగ్ చేస్తున్నారు. ఐతే రీసెంట్ గా బాలకృష్ణ గురించి ఒక విషయాన్ని షేర్ చేసుకుంది.
బాలయ్య బాబు తన పిల్లలకు గిఫ్ట్ గా ఒక వయోలిన్ ని పంపించారని చెప్తూ ఆ వయోలిన్ ని తన పిల్లలకు ఇచ్చి సర్ప్రైజ్ చేసింది ఉదయ భాను. "ఒక స్పెషల్ పర్సన్ మీకు గిఫ్ట్ పంపించారు. బాలయ్య మామ అంటే ఎవరికీ ఇష్టం ఇక్కడ" అంటూ తన ట్విన్ డాటర్స్ ని అడిగింది. మాకిష్టం అంటూ ఇద్దరూ పిల్లలు చేతులెత్తారు. దాంతో మీకు ఎంతో ఇష్టమైన వయోలిన్ పంపించారు అంటూ ఆ వయోలిన్ ని వాళ్లకు ఇచ్చింది. అది చూసాక ఆ ఇద్దరి పిల్లల్లో ఆనందం వేరే లెవెల్ లో ఉంది. దానికి ఆ ఇద్దరు పిల్లలు థ్యాంక్యూ బాలయ్య మామ అని చెప్పారు. ఉదయభాను అటు బాలయ్యకు ఇటు నారా బ్రాహ్మణికి థ్యాంక్స్ చెప్పింది. ఇక నెటిజన్స్ ఐతే "బాలయ్య బంగారం.. తండ్రికి తగ్గ కూతురు బ్రాహ్మణి నారా... జై బాలయ్య మా నందమూరి బిడ్డ కదా అలానే ఉంటది" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఉదయభాను వన్స్ మోర్ ప్లీజ్, సాహసం చేయరా డింబకా, డ్యాన్స్ బేబీ డ్యాన్స్, రేలారే రే రేలా, ఢీ రియాలిటీ డ్యాన్స్ షో, జాణవులే నెరజాణవులే, పిల్లలు పిడుగులు ఇలా పాపులర్ షోస్ చేసింది. ఇక యాంకర్ గానే కాదు సినిమాల్లోనూ నటించింది. ఉదయభాను మొదటి సినిమా ఎర్ర సైన్యం. తర్వాత లీడర్ లో ఒక సాంగ్ చేసింది.
![]() |
![]() |